
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి పురస్కరించుకుని హుజురాబాద్ నియోజకవర్గము హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వర్థంతి వేడుకలు గణంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా దేశ ప్రజలకు అందించిన సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లూరి కిరణ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సొల్లు బాబు, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల, సీనియర్ నాయకులు ఖాజీపేట శ్రీనివాస్, మేకల తిరుపతి, మిడిదొడ్డి శ్రీనివాస్, సందమల్ల బాబు, వడ్లూరి విజయ్ కుమార్, మిడిదొడ్డి అమర్ ,వేల్పుల విజయ్ కుమార్, దుబాసి బాబు, ఏర్ర రవీందర్, ఏర్ర కుమార్ ,సదానందం, అప్పాల రఘుపతి, తిరుపతి, గంటా కిరణ్ రెడ్డి, ప్రతాప నాగరాజు, జి రాఘవేంద్ర, కుడికాల శ్రీనివాస్, సొల్లు సునిత, లక్ష్మి, మోతె కుమారస్వామి, యండి రియాజ్ ,వినోద్ రెడ్డి, గందె సాయి తదితరులు పాల్గొన్నారు.