
- పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ వొడితల ప్రణవ్
- మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి పరకాల:
కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు.పట్టభద్రుల ఓటర్లను నాయకులు, కార్యకర్తలు స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేసి మల్లన్నను పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ వొడితేల ప్రణవ్ పిలుపునిచ్చారు.
మంగళవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారము పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో ఆర్డినేటర్ వొడితేల ప్రణవ్ పరకాల పట్టణ మరియు పరకాల మండల వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మండల స్థాయి సన్నాహక సమావేశం పరకాల పట్టణంలోని ఆర్ ఆర్ గార్డెన్ లో నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల కో- ఆర్డినేటర్ వొడితల ప్రణవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని బీఆర్ఎస్ బిజెపిలకు వేసే ఓటు వల్ల ఒరిగేది ఏమీ లేదని పట్టభద్రులకను మెప్పించి ఓటు అడగాలని కోరారు. బిఆర్ఎస్, బీజేపీ పార్టీ ల పట్టభద్రులు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని. మోదీ పదేండ్ల పాలనలో సంవత్సరానికి రెండు కోట్ల చొప్పున దేశానికి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు. అవి ఇవ్వకపోగా.. 40 కోట్ల మంది భారతీయులకు అన్నం లేకుండా చేశాడని విమర్శించారు యువత విద్యార్థుల ఆత్మ బలిదానాలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి అనేక హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అందుకే గత గడిచిన శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా పట్టభద్రులైన్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటు వేసి ఆ పార్టీలకు చెప్పనున్నారని ఆయన అన్నారు.
వచ్చే ఐదు రోజులు కీలకమని ఈ ఐదు రోజులలో కష్ట పడి పనిచేయాలని ప్రతి కార్యకర్త పట్టభద్రుని కలిసి ఓటు అడగాలని ప్రతి ఒక్క ఓటు కీలకమని మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు పరకాల నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. సమావేశానికి ముందుగా మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నేతలు నివాళులర్పించారు.
ఈ సమావేశంలో వొడితల ప్రణవ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి గారు పరకాల మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి , పరకాల పట్టణ పార్టీ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్ , పరకాల మండల,పట్టణ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, పట్టభద్రుల బూత్ ఇన్చార్జులు, గ్రామ, వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు ఇతర సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.