
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
అంతర్జాతీయ టీ దినోత్సవ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో గల గ్రావిటీ టీ సెంటర్ లో పలువురు టి అభిమానులు అంతర్జాతీయ టీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీ తాగడం నేడు అందరికీ సాధారణంగా అలవాటు ప్రక్రియని, టీ తాగడం అనేది మనిషి జీవనంలో మిలీతమై పోయిందని దానిని ఆంగ్లేయుల నుండి నేటి వరకు టీ కి అభిమానుల నుండి ఎంతో ఆదరణ లభిస్తుందని, టీ కూడా అనేక రకాలుగా లభిస్తుండడంతో పలు రకాల టీలను టీ అభిమానులు ఆస్వాదిస్తున్నారు. హుజురాబాద్ ల నిర్వహించిన వేడుకల్లో కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పంజాల శ్రీధర్ గౌడ్, కొలిపాక మహేష్, తాళ్ల దామోదర్, ఏండి అశు, తాళ్లపల్లి ఆశిష్, రెంటాల అనిల్, గ్రావిటీ టి సెంటర్ యజమానులు పిల్లల సతీష్, తాళ్లపల్లి చిన్న రమేష్, పలువురు టీ అభిమానులు పాల్గొన్నారు.