
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
–నియోజకవర్గంలో అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి
–ప్రైవేటు విద్యాసంస్థలను తనిఖీలు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటించేలాచుడాలి
–ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్య వ్యాపారం చేస్తూ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని, సిఎం రేవంత్ రెడ్డి రాష్ర్టంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ అరికట్టే విధంగా చర్యలు తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ఎన్నికల హామీలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ హుజురాబాద్, జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలను ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్మిషన్ లేకుండా నడుస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలను గుర్తించి సీజ్ చేయాలని అలాగే ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి (ఏఐఎస్ఎఫ్) పక్షాన డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడి అరికట్టే విధంగా ఫ్రీజర్ నియంతను చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీలలో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెరిగేల కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విద్యార్థులకు, యువకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. విద్యార్థులకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటిలు, ల్యాప్ టాప్స్, మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని విద్యార్థులకు ప్రభుత్వ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఫీజుల పేరిట ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టాలని, ప్రభుత్వం విద్యాశాఖ ఫీజులు నియంత్రణకి కఠిన చట్టాలు అమలు చేసి నిబంధనలు పాటించని విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని రామారపు వెంకటేష్ హెచ్చరించారు.
