
- అవస్థలు పడుతున్న కార్యాలయానికి వచ్చే ప్రజలు
- చూసి చూడనట్లుగా వదిలేస్తున్న తాసిల్దార్, ఇతర ఉద్యోగులు
- మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
సమస్యలపరిష్కారం కోసం వచ్చే ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా హుజురాబాద్ తహసీల్దార్ కార్యాలయం మారింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇష్టం వచ్చినట్లు వాహనాల ఉండడం వల్ల నడిచివచ్చి సమస్యలు చెప్పుకునే వాళ్లకు కనీసం కార్యాలయం లోపలికి వెళ్ళే పరిస్తితి లేకుండా పోయింది. వివిధ పనులపై వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తాసిల్దార్ కార్యాలయాన్ని పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్నారు. వారికి చెందిన వాహనాలను తాసిల్దార్ కార్యాలయంలోని ముందు భాగంలో ఉన్న చెట్ల కింద ఈస్టారీతిన పార్కింగ్ చేసి వెళుతుండడంతో ఇతర వాహనదారులకు ఏదైనా పని కోసం కార్యాలయానికి వచ్చే వారికి తీవ్ర సౌకర్యంగా మారుతుంది. అసౌకర్యాలకు నిలయంగా మారడం పైన ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతుంది. ఏంటి నడిచి ఆఫీస్ లోపలికి ఎలా వెళ్ళాలి.. ఇన్ని బండ్లు దారికి అడ్డంగా ఉంటే ఎట్లా…బండ్లు పెట్టుకోవడని అడ్డాగా తహసీల్దార్ కార్యాలయం మారిందా…అని పలువురు అంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్న కనీసం తన కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలియకుండా తహసీల్దార్, కార్యాలయ ఉద్యోగులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా ఉంటున్నారా అని ఆశ్చర్యపోతున్నారు..!? ఇప్పటికైనా తాసిల్దార్ తన కార్యాలయం వద్ద విచ్చలవిడిగా ఈస్టారీతిన వాహనాలను నిలిపి వెళ్తున్న వారిపై దృష్టి సారించి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తుమ్మనపల్లికి చెందిన ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులకు కళ్ళుండి చూడలేని కబోదిలా వ్యవహరించడం సరైనది కాదని… కార్యాలయానికి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.

