
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ లో మంగళవారం రాత్రి జరిగిన రేణుక ఎల్లమ్మ జాతర, బుధవారం హుజురాబాద్ లో జరిగిన బీరన్న జాతరకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రెండు జాతరలలో మొక్కలు అప్పజెప్పారు. అనంతరం భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుళ్ళని కోరుకున్నానని అన్నారు. తెలంగాణ మొత్తం పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు. రానున్న వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని ప్రార్థిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పండించే రైతులకే బోనస్ ఇస్తామనడం సరైనది కాదని, ఏ రకమైన వడ్లను పండించిన తప్పకుండా బోనస్ ఇవ్వాలని అన్నారు. రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ కూడా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, కౌన్సిలర్లు మక్కపల్లి కుమార్ యాదవ్, ప్రతాప తిరుమల్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సింగల్ గుండా చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, హుజురాబాద్ యాదవ సంఘం అధ్యక్షులు బద్దుల రాజ్ కుమార్ యాదవ్, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరేణి సమ్మయ్య, యాదవ సంఘం నాయకులు తొర్రి చిన్న సమ్మయ్య, భాష బోయిన సదానందం, భాష బోయిన ఓదెలు, గండ్రకోట రమేష్, గండ్రకోట సారయ్య, మక్కపెల్లి రమేష్ , భాష బోయిన రాజ కొమురయ్య, సింగరేణి రవి, తొర్రి అశోక్, జక్కుల రాజు, లెంకలపల్లి, కుమార్ , లెంకలపల్లి నవీన్, లెంకల పల్లి రవి, బద్దుల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


