
-డిసిహెచ్ ఎస్ కృష్ణప్రసాద్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని గ్రామీణులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని డిసిహెచ్ ఎస్ కృష్ణప్రసాద్ కోరారు. బుధవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రినీ సాధారణ తనిఖీలో భాగంగా ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని డయాలసిస్, ల్యాబ్, ఫార్మసీ, లేబర్, క్యాజువలిటీ, పలు విభాగాలు, వార్డులను పరిశీలించారు. ఆసుపత్రి ఏఓ డాక్టర్ నారాయణరెడ్డి, డాక్టర్ సోమశేఖర్ లను పలు వివరాలు అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో వుంటున్నారన్నారు. రోగుల పరిస్థితిని బట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడే చికిత్సలు అందిస్తున్నారని, తప్పని పరిస్థితిలోనే నిబంధనల ప్రకారం వరంగల్ ఎంజీఎం, కరీంనగర్ సివిలాసుపత్రికి రెఫర్ చేస్తున్నారన్నారు. వైద్యులు ఆసుపత్రికి గైర్హాజరు అయితే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. ఆసుపత్రి కేటాయించిన అన్ని టార్గెట్ లు పూర్తి చేశారన్నారు. వైద్యులు, సిబ్బంది అంకితభావంతో విధులను నిర్వర్తిస్తున్నారు. ఆసుపత్రి సేవలు సంతృప్తికరంగా వున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎo ముజామిల్ ఖాన్, వైద్యులు పి శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.

