
బాధిత రైతు కౌరు లింగారెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తన పొలంలో అక్రమంగా లారీ టిప్పర్లతో మట్టి పోసి నాటును ధ్వంసం చేసిన డిబిఎల్ కంపెనీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సింగపూర్ గ్రామానికి చెందిన బాధిత రైతు కౌరు లింగారెడ్డి విజ్ఞప్తి చేశారు. పొలాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. మండలంలోని సింగాపురం గ్రామం శివారులో కౌరులింగారెడ్డి తన కూతురు భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. అట్టి పొలం పక్కనే జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. కాగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తను నాటు వేసుకున్న భూమిలో అర్థరాత్రి జాతీయ రహదారి నిర్మాణం కోసం టిప్పర్లతో మట్టి పోసి పొలాన్ని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. తనకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా కాంట్రాక్టర్ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు తన పొలంలో మట్టి పోసి పొలాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు.