
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
సామాజికవేత్త భాగ్యరెడ్డి వర్మ 136వ జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అని, అంబేద్కర్ కంటే ముందే దళిత జాతి ఉద్ధరణకు కృషి చేసిన మహనీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాక సతీష్, సొల్లు బాబు కొలిపాక సమ్మయ్య, రామగిరి అంకుష్, ఉప్పు శ్రీనివాస్, జూపాక మల్లీశ్వరి, ఆలేటి రవీందర్, సిరిపాటి వేణు, బత్తుల మనోజ్, యేముల పుష్పలత, కే నర్సింగం, పసుల స్వామి,తొగరు స్వామి, అచ్చుత్,ముక్క రమేష్, మరాఠీ నరేష్, చందు తదితరులు పాల్గొన్నారు.