
- ఎమ్మెల్సీ పరకాల నియోజకవర్గం కోఆర్డినేటర్ వోడితల ప్రణవ్
స్వర్ణోదయం ప్రతినిధి పరకాల:
నల్గొండ -ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ఎమ్మెల్సీ పరకాల నియోజకవర్గం కోఆర్డినేటర్ హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వరదల ప్రణవ్ పిలుపునిచ్చారు. బుధవారం పరకాల నియోజకవర్గం గీసుకొండ, సంగెం, దామెర, నడికూడ మండలలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ప్రణవ్ పాల్గొని కార్యకర్తలకి దిశ నిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారెంటీలను కనితి కాలంలోనే అమలు చేసిందని, గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని ఓటర్లకు వివరించి చైతన్య పరచి ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలిపించేలా కృషియాలనారు. ఎమ్మెల్సీ పరకాల నియోజకవర్గంలో మెజారిటీ కోట్లు వేయించి రాష్ట్ర ప్రభుత్వానికి గిఫ్ట్ గా ఇవ్వాలని కో అర్డినేటర్, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

