
-మండల వ్యవసాయ అధికారి సునీల్ కుమార్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజూరాబాద్ మండల వ్యవసాయ అధికారి చందుపట్ల సునీల్ కుమార్ అన్నారు. శనివారం హుజూరాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామ రైతులతో సమావేశమై రైతులు విత్తనాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. విత్తనాల కొనుగోలు చేసే ముందు కచ్చితంగా బిల్లులు తీసుకొని పంట కాలము పూర్తి అయ్యేవరకు ఆ బిల్లులను భద్రపరచుకోవాలన్నారు. విత్తన బస్తాల పై ఉన్న కనీసధర కన్నా ఎక్కువ పెట్టి కొనరాదనీ, ఎక్కడైనా తక్కువ ధరకు వస్తున్నాయని తీసుకుంటే పంట దిగుబడి సమయములో నకిలివని తేలితే చాలా నష్టపోతారని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా విత్తనాల అమ్మువారినీ వ్యవసాయ శాఖ కార్యాలయంలో తెలియజేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం వానాకాలంలో లోతుదుక్కులు చేసుకోవాలని వ్యవసాయ శాఖలో అమలుపరిచే సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమములో వ్యవసాయ విస్తరణ అధికారి పొద్దుటూరి సతీష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి జయెందర్, కారోబార్ రామస్వామి, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పుష్పలత మరియు రైతులు పాల్గొన్నారు.