
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ (కాట్రపల్లి):
మండల పరిధిలోని కాట్రపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం వ్యవసాయ శాఖ, జమ్మికుంట కెవికె (KVK) ఉమ్మడి ఆధ్వర్యంలో ‘ఖేతీ బచావో అభియాన్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కెవికె శాస్త్రవేత్త వేణు మాట్లాడుతూ… రైతులు తమ పొలాల్లో క్రమం తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరీక్షా ఫలితాల ఆధారంగా నేల అవసరాలకు తగినట్లుగానే ఎరువులు వాడాలని, సమతుల్య పోషక యాజమాన్యాన్ని పాటించాలన్నారు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచి, రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించడం ద్వారా స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. అలాగే, సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యాన పంటల సాగును చేపట్టి అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు.

అనంతరం హుజూరాబాద్ ఏవో భూమిరెడ్డి మాట్లాడుతూ… ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సాగునీటి లభ్యతకు అనుగుణంగా రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచించారు. వరి కోతల అనంతరం కొయ్యకాళ్లను తగలబెట్టకుండా, భూమిలోనే కలియదున్ని నేలల సారాన్ని కాపాడుకోవాలన్నారు. పంట అవశేషాలను త్వరగా కుళ్లింపజేసేందుకు వేస్ట్ డికంపోజర్, ప్రొఫైల్ వంటి జీవరసాయనాలను పిచికారీ చేయవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెరుమాండ్ల హైమ, ఏఈఓ నిఖిల్ కుమార్, గ్రామ కార్యదర్శి శ్రవణ్, వ్యవసాయ శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ దామెర అనూష- అనురాగ్ గారు, 20వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.





