Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వార్డులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని 5వ వార్డు కౌన్సిలర్ సొళ్ళు సునీత తెలిపారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని 5వ వార్డులో కౌన్సిలర్ సొళ్ళు సునీత ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది.

ప్రసిద్ధ శరత్ మ్యాక్సివిషన్ ఐ హాస్పిటల్ వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని వార్డు ప్రజలకు అధునాతన పరికరాలతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 54 మంది స్థానికులు పాల్గొని కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా సలహాలు, సూచనలు అందించడమే కాకుండా తగిన వైద్య సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొళ్ళు బాబు, నాయకులు కోలిపాక శంకర్, మెప్మా సిబ్బంది CLRP కె. స్వరూప, RP జి. భాగ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్ కే. అరుణ లతో పాటు స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ దామెర అనూష- అనురాగ్ గారు, 20వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.





