
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 5: తెలంగాణ డెమోక్రటిక్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా హుజురాబాద్‌కు చెందిన ప్రముఖ సీనియర్ సిటిజన్ డాక్టర్ విష్ణుదాసు గోపాల్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ పాషా, ప్రధాన కార్యదర్శి గంజి జయవర్ధన్ గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం హుజురాబాద్ యూనిట్ కార్యదర్శిగా రెండుసార్లు పనిచేసిన గోపాల్ రావు, కరీంనగర్ జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. అంతర్జాతీయ కళాకారుడైన ఆయన ‘అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు’, ‘పీవీ అచీవ్మెంట్ అవార్డు’లతో పాటు 6 ప్రపంచ రికార్డులు సాధించి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి గోపాల్ రావు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించి, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆయన నియామకం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి బండ సింధుజ గారు, 6వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్.





