
స్వర్ణోదయం ప్రతినిధి ధర్మపురి / హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అమలు చేస్తూ ప్రత్యేక జీవో విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ‘బేడ (బుడగ) జంగం జన సంఘం’ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు గురువారం ధర్మపురిలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక జీవో వెలువడేలా కీలక పాత్ర పోషించినందుకు మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి వర్గీకరణ అమలుకు కృషి చేసిన ముఖ్యమంత్రికి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు, తెలంగాణ ప్రభుత్వానికి బేడ జంగం జన సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి బండ సింధుజ గారు, 6వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్.





