
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని ప్రముఖ శ్రీ హనుమాన్ దేవాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) కే. సుధాకర్ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 07-11-2026 (శనివారం) ఉదయం 11:00 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఈ లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ హుండీ లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని ఆసక్తి ఉన్న భక్తులు, స్వామివారి సేవకులు నేరుగా వచ్చి లెక్కింపులో భాగస్వాములు కావచ్చునని ఆయన కోరారు. పారదర్శకంగా జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, శ్రీ హనుమాన్ స్వామివారి సేవలో తరించాలని ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు విజ్ఞప్తి చేశారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి బండ సింధుజ గారు, 6వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్.





