
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజూరాబాద్ : హైదరాబాద్‌లోని కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్ల నిధులతో పాటు అత్యంత విలువైన స్థలాన్ని కేటాయించడం పట్ల హుజూరాబాద్ నియోజకవర్గ పద్మశాలి, చేనేత వర్గాలు మరియు కాంగ్రెస్ నాయకులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. పద్మశాలీల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు నిచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా గురువారం హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ, వివిధ చేనేత, పద్మశాలి సంఘాల నాయకులు స్వీట్లు పంపిణీ చేసుకుని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణలతో పాటు ఈ నిర్ణయానికి సహకరించిన వివిధ చేనేత, పద్మశాలి సంఘాల నాయకులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ విజయోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా చేనేత సంఘ అధ్యక్షులు బండారి సదానందం, సంగం శ్రీనివాస్, సంగం సత్యనారాయణ, సంగం శ్రీనివాస్ (మెడికల్), బిసి నాయకులు కాజీపేట శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు పుల్లా రాధ, టౌన్ అధ్యక్షులు మార్త రవీందర్, గడ్డం రాఘవేంద్ర, మండల అధ్యక్షులు కోమటి సదానందం, దాసి సదానందం, పలువురు బిసి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి బండ సింధుజ గారు, 6వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్.





