Oplus_16908288
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి
హుజూరాబాద్ :
విప్లవ విద్యార్థి ఉద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) నాయకులు కొనియాడారు. PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ 5 నుండి 11 వరకు నిర్వహించే అమరవీరుల వర్ధంతి వారోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని కాకతీయ జూనియర్ కాలేజీలో PDSU ఆధ్వర్యంలో అమరవీరుడు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 51వ వర్ధంతి సభను నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విప్లవ విద్యార్థి అమరవీరుల ఆశయ సాధనకు, విద్యార్థుల హక్కుల పోరాటాలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో PDSU ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్, జిల్లా సహాయ కార్యదర్శి కొనేటి ప్రశాంత్, నాయకులు రాహుల్, దిలీప్, సందీప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి బండ సింధుజ గారు, 6వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్.





