
- ₹1.5 కోట్లతో 4 ప్రధాన కూడళ్ల అభివృద్ధి పనులు ప్రారంభం
- హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. నియోజకవర్గానికి రూ. 15 కోట్ల అభివృద్ధి నిధులను మంజూరు చేయించినట్లు ఆయన వెల్లడించారు.

శుక్రవారం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని చౌరస్తాలో పట్టణ సుందరీకరణ పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ..
- పట్టణ సుందరీకరణ: రూ. 1.50 కోట్లతో పట్టణంలోని 4 ప్రధాన కూడళ్లను సుందరీకరించే పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
- రూ. 7 కోట్లతో మౌలిక వసతులు: రూ. 4.5 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ. 2.5 కోట్లతో డ్రెయినేజీ వ్యవస్థ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామన్నారు.
- చిల్డ్రన్ పార్క్ & మౌలిక వసతులు: పిల్లలకు ఆహ్లాదాన్ని అందించేందుకు చిల్డ్రన్ పార్క్ తో పాటు ఇతర అభివృద్ధి పనులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వివరించారు.
- గ్రామీణాభివృద్ధి: గ్రామాల్లో ఐ-మాస్ట్ (i-Max) లైట్లు ఏర్పాటుతో పాటు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రూ. 58 లక్షలతో కొత్త బోర్ల ఏర్పాటును మంజూరు చేసినట్లు తెలిపారు.
- మాటల ప్రభుత్వం కాదు: “ఇతర నాయకుల్లాగా మేము ఊహాజనిత మాటలు చెప్పం.. ఏం చెప్తామో అదే చేసి చూపిస్తాం” అని ప్రణవ్ వ్యాఖ్యానించారు.
ధర్మరాజుపల్లి లబ్ధిదారులతో ‘ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ నిరుపేదలకు ఒక వరంగా మారిందని ప్రణవ్ తెలిపారు. పీసీసీ ఆదేశాల మేరకు హుజూరాబాద్ మండల పరిధిలోని ధర్మరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో కలిసి “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలు జరుపుకోనున్నట్లు వెల్లడించారు.
- ఇళ్ల నిర్మాణ పురోగతి: రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 4,50,000 ఇళ్లలో ఇప్పటికే 2,21,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని; హుజూరాబాద్ నియోజకవర్గానికి మంజూరైన 5,500 ఇళ్లలో ఇప్పటికే 2,500కు పైగా ఇళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
ఇదే వేదికపై నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్పర్సన్ అంజలి, స్థానిక కౌన్సిలర్లు మహమ్మద్ ఖాళిద్ హుస్సేన్, కోయల్ కార్ భారతి, ఇతర కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, మైనారిటీ, మహిళా విభాగాల నాయకులు మరియు పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీ బండారి సదానందం గారు(రాంపూర్), కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు, హుజురాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్.





