
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 06:
స్థానిక హుజురాబాద్ క్లబ్ ఎన్నికలు సాధారణ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తూ పట్టణంలో తీవ్ర వేడిని రాజేస్తున్నాయి. గత పదేళ్లుగా మాజీ మంత్రి కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు కనుసన్నల్లో అభివృద్ధి పథంలో పయనించిన క్లబ్‌కు ఈసారి ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో 13 స్థానాలకు గాను మొత్తం 31 మంది అభ్యర్థులు రెండు వర్గాలుగా విడిపోయి బరిలో నిలిచారు.
326 మంది ఓటర్లు… 15న పోలింగ్, ఫలితాలు!
మొత్తం 335 మంది సభ్యులు కలిగిన ఈ క్లబ్లో ప్రస్తుతం 326 మందికి ఓటు హక్కు ఉంది. ఈ నెల 15న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నారు. 46 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఈరోజు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 31 మంది బరిలో మిగిలారు.
పదవుల వారీగా హోరాహోరీ పోటీ:
కార్యదర్శి (సెక్రటరీ): ప్రధానమైన ఈ పదవికి ఉద్దండులైన కట్కూరి మల్లారెడ్డి, ముచ్చ నారాయణ రెడ్డిల మధ్య నేరుగా హోరాహోరీ పోటీ నెలకొంది.
ఉపాధ్యక్షుడు (వైస్ ప్రెసిడెంట్): పుల్లూరి ప్రభాకర్ రావు, కంకణాల విజయరెడ్డి, గౌరు సమ్మిరెడ్డి (ముగ్గురు పోటీలో).
సంయుక్త కార్యదర్శి (జాయింట్ సెక్రటరీ): మంద రమేష్ (RK), శివనాధుని వేణు, కొమురవెల్లి హరి ప్రసాద్ (ముగ్గురు పోటీలో).
కోశాధికారి (ట్రెజరర్): గర్రెపల్లి(తాడికల్) శ్రీను, కొండ గణేష్ (ఇద్దరు పోటీలో).
కార్యవర్గ సభ్యులు (9 పోస్టులు): 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
(పోటీలో ఉన్న ముఖ్యులు: కేసిరెడ్డి నర్సింహారెడ్డి, గడ్డం ధర్మారెడ్డి, మాగంటి శ్రీధర్, విష్ణుదాసు గోపాల్ రావు, మేకల రాజిరెడ్డి, నూక శ్రీనివాస్, బత్తుల సమ్మయ్య, జున్నోజు రాజేందర్, పోనుగంటి శ్రవణ్ కుమార్, గోలీ సురేష్, కోలే కల్యాణ్ రావు, దొనకొండ సత్యనారాయణరెడ్డి, జిల్లెళ్ళ భాస్కర్ రెడ్డి, ఈదులకంటి రవీందర్ రెడ్డి, పుల్లూరి శ్రీకాంత్, అయ్యప్ప కొoరయ్య, వేముల మనోహర్, మొలుగురి సదయ్య, అకినపల్లి అనిల్, పలకల శ్రీనివాస్ రెడ్డి, ఎండీ మతీన్) పోటీలో ఉన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా ‘క్యాంపు’ రాజకీయాలు!
ఎన్నికల పర్వం ఊపందుకోవడంతో రెండు వర్గాల నాయకులు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. దీపావళి పండుగ ముగియగానే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక వర్గం హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
2014 నుండి మాజీ రాజ్యసభ సభ్యులు వి. రాజేశ్వర్ రావు, మాజీ ఎంపీపీ జగన్నాథ్ నాయుడు, కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావుల సహకారంతో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, పట్టణంలోని ప్రధాన కూడలిలో జిమ్, స్విమ్మింగ్, టెన్నిస్, క్యారమ్, బ్యాడ్మింటన్ వంటి ఆధునిక వసతులు, సామాజిక కార్యక్రమాలతో అలరిస్తున్న హుజురాబాద్ క్లబ్లో నవంబర్ 15 వరకు ఈ ఎన్నికల సందడి మిన్నంటనుంది. అభ్యర్థుల ప్రచారం సాధారణ ఎన్నికల ప్రచారానికి మించి ఉండడంతో అందరి దృష్టి ఈ ఎన్నికలపైనే కేంద్రీకృతమై ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
#లోకల్ యాడ్స్#

హుజురాబాద్ క్లబ్ ఎన్నికలలో శ్రీ పుల్లూరి ప్రభాకర్ రావు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని విజ్ఞప్తి.
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీ బండారి సదానందం గారు(రాంపూర్), కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు, హుజురాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్.





