
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : పద్మశాలి సంఘ భవనం నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గాను శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ చేనేత సెల్, పద్మశాలి సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సబ్బని రాజేందర్ ల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్ ల ఫ్లెక్సీకి పాలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా పద్మశాలీల ఆత్మగౌరవ భవనానికి నిధులు మంజూరు చేయడం సంతోషదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితెల ప్రణవ్ బాబు, హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, పలువురు కౌన్సిలర్లు అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్ కోకాపేటలోని 2.5 ఎకరాలు పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినందుకుగాను పద్మశాలి సమాజం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చేనేత సెల్ జిల్లా అధ్యక్షులు బండారి సదానందం రాష్ట్ర, చేనేత సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రామచంద్రం, చందుపట్ల జనార్ధన్, మార్త రవీందర్, వేముల యాదగిరి, చిలకమారి శ్రీనివాస్, సంగేమ్ సత్యనారాయణ, సంగం శ్రీనివాస్ (మెడికల్), సంఘం శ్రీనివాస్ (చిక్స్), దేవసాని ప్రియదర్శిని, కేఆర్ బిక్షపతి, ఇప్పకాయల సాగర్, కుడికాల ప్రభాకర్, ముషం రాజేందర్, కోమటి సదానందం, మామిడాల శంకరయ్య, మంచికట్ల కమలాకర్, పుల్ల రాధ, సొల్లు సునీత తదితరులు పాల్గొన్నారు.

పాలాభిషేకం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు బండారి సదానందం..
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీ బండారి సదానందం గారు(రాంపూర్), కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు, హుజురాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
హుజురాబాద్ క్లబ్ ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటు ఉపాధ్యక్షులుగా పోటీ చేస్తున్న శ్రీ పుల్లూరి ప్రభాకర్ రావు గారికి వేయగలరు.






