
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ క్లబ్ ఎన్నికల వేడి పరాకాష్టకు చేరింది. పోటీలో ఉన్న అభ్యర్థులు శనివారం రాత్రి హన్మకొండలోని హంటర్ రోడ్డులో గల క్లబ్ ఫౌండర్, మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

క్లబ్ కార్యదర్శి, వైస్ చైర్మన్ పదవులకు పోటీ పడుతున్న కట్కూరి మల్లారెడ్డి, పుల్లూరి ప్రభాకర్ రావుల నేతృత్వంలో అభ్యర్థుల టీమ్ కెప్టెన్‌తో ప్రత్యేకంగా సమావేశమై ప్రస్తుత ఎన్నికల పరిస్థితులపై చర్చించారు. రాబోయే రోజుల్లో క్లబ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు కెప్టెన్‌కు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కార్యదర్శి అభ్యర్థి మంద రమేష్, కోశాధికారి అభ్యర్థి గర్రెపల్లి (తాడికల్) సీనులతో పాటు కార్యవర్గ సభ్యత్వానికి పోటీ చేస్తున్న ఇతర బృందం సభ్యులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ బండారి సదానందం గారు(రాంపూర్), కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు, హుజురాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
హుజురాబాద్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్న శ్రీ పుల్లూరి ప్రభాకర్ రావు గారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని విజ్ఞప్తి.






