
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్ (బంజారాహిల్స్):
హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీకి భారీగా బలం చేకూరింది. బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో, నియోజకవర్గ ఇంచార్జ్ కూకట్ల సంతోష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత సమక్షంలో పలువురు మైనారిటీ, ఇతర ముఖ్య నాయకులు టిఆర్ఎస్లో చేరారు.

హుజూరాబాద్ మండలం పెద్దపాయిపల్లికి చెందిన మైనారిటీ నాయకుడు ఎం.డి. సల్మాన్ ఖాన్‌తో పాటు మరో 20 మంది మైనారిటీ నాయకులు, అలాగే రంగాపూర్ గ్రామానికి చెందిన రెడ్డబోయిన సురేష్ తన అనుచరులతో కలిసి కవితక్క చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా కూకట్ల సంతోష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కవితక్క నాయకత్వం, పార్టీ ఆశయాలపై నమ్మకంతోనే వివిధ వర్గాల నాయకులు టిఆర్ఎస్లోకి తరలివస్తున్నారన్నారు. సామాజిక న్యాయం, ప్రజల హక్కుల సాధనే లక్ష్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేయు వారు : శ్రీ బండారి సదానందం గారు(రాంపూర్), కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు, హుజురాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్.





