
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజూరాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసిని అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన 17 వివిధ అభివృద్ధి అంశాలకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

ఈ సందర్భంగా చైర్పర్సన్ సుహాసిని మాట్లాడుతూ… ఎల్నినో ప్రభావంతో మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ఉండేందుకు అవసరమైన ప్రత్యేక నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో గణేష్ నగర్ డంపింగ్ యార్డులో ఇంటర్నల్ లైటింగ్, సీసీ రోడ్లు, షెడ్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

అలాగే, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధుల నుంచి ₹5 లక్షలతో డంపింగ్ యార్డులోని 25 KV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తగా 100 KVA సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గూడూరి అంజలి, కమిషనర్ బండి కిషన్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి జి. అభినవ్, టీపీఎస్ ఎస్. శ్రీకాంత్, సానిటరీ ఇన్స్పెక్టర్ డి.కిరణ్, టెక్నికల్ అధికారి నరేష్, జూనియర్ అకౌంటెంట్ సి.హెచ్. గోపాల్ రెడ్డి, సిబ్బంది టి. భవర్ సింగ్, ఎస్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాం

శ్రీ బండారి సదానందం గారు(రాంపూర్), కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు, హుజురాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్.





