
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఈ నెల 15న జరగనున్న హుజురాబాద్ క్లబ్ పోరు వేడెక్కింది. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచారం ఉధృతం చేసిన ముచ్చ నారాయణ రెడ్డి ప్యానెల్ అభ్యర్థులు, శనివారం క్లబ్ ఫౌండర్, మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్‌లను కలిసి వారి ఆశీస్సులు, మద్దతును తీసుకున్నారు.


క్లబ్ కార్యదర్శి అభ్యర్థి ముచ్చ నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ అభ్యర్థి కంకణాల విజయరెడ్డిల నేతృత్వంలోని సభ్యుల బృందం తొలుత హన్మకొండలోని హంటర్ రోడ్డులో గల కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసింది. ఆ తర్వాత సింగపూర్ లో ఉన్న వోడితెల ప్రణవ్‌తో ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.


ఈ సందర్భంగా క్లబ్ ఎన్నికల ప్రస్తుత పరిస్థితి, ప్రచార సరళిపై వారితో చర్చించారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం క్లబ్ సమగ్ర అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా కెప్టెన్, ప్రణవ్‌లకు హామీ ఇచ్చారు. తమ ప్యానెల్‌ను ఆశీర్వదించి మద్దతుగా నిలవాలని కోరగా, వారి నుంచి సానుకూల స్పందన లభించినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ అభ్యర్థి శివనాధుని వేణు, ట్రెజరర్ అభ్యర్థి కొండా గణేష్, ఈసీ మెంబర్లు కోలే కళ్యాణ్ రావు, గోలి సురేష్, దొనకొండ సత్యనారాయణరెడ్డి, జిల్లెల భాస్కర్ రెడ్డి, ఈదులకంటి రవీందర్ రెడ్డి, పుల్లూరి శ్రీకాంత్, అయ్యప్ప కొమురయ్య, వేముల మనోహర్, పలకల శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పలువురు మద్దతుదారులు, నాయకులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ కోనేటి రాజయ్య గారు, బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హుజూరాబాద్.





