
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజూరాబాద్ పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం నాన్‌స్టాప్ బస్సులను హుజూరాబాద్ బస్టాండ్‌లో ఆపాలని హుజూరాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు అన్నారు. శనివారం హుజురాబాద్ ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ బి ఏంజెల్ కు బిజెపి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్ పట్టణం విద్యా, వ్యాపార, వైద్య అవసరాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కీలక కేంద్రంగా ఉందని, ప్రతిరోజూ అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు.నాన్‌స్టాప్ బస్సులు హుజూరాబాద్ బస్టాండ్‌లో ఆగకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా అత్యవసర పనులపై వెళ్లేవారు, విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. హుజూరాబాద్ మీదుగా ప్రయాణించే నాన్‌స్టాప్ బస్సులకు బస్టాండ్‌లో నిర్ణీత స్టాపింగ్ సౌకర్యం కల్పిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నాన్‌స్టాప్ బస్సులను హుజూరాబాద్ బస్టాండ్‌లో ఆపేలా చర్యలు తీసుకొని, ప్రయాణికుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఇబ్బందులను గుర్తించక నాన్ స్టాప్ బస్సులను హుజురాబాద్‌లో ఆపకపోతే బిజెపి పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు,సెంట్రల్ ఫిలిం బోర్డ్ మెంబర్ సబ్బని రమేష్ , తిప్ప బత్తిని రాజు, గంట సంపత్, నరాల రాజశేఖర్ ,కొలిపాక శ్రీనివాస్, వాసు, శ్రీధర్, కుమార్ స్వామి, సంతోష్, అనిల్, కే.పవన్, బొడిగే రాధ, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ కోనేటి రాజయ్య గారు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు హుజూరాబాద్.





