
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హుజూరాబాద్ ఆర్డీవో జలకుమారి, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో సునీత స్పష్టం చేశారు. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు’ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారుల నివాసాల్లో స్థానికులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకొన్నారు.




ఈ సందర్భంగా ఆర్డీవో జలకుమారి, మండల స్థాయి అధికారులు మాట్లాడుతూ.. గతంలో అద్దె ఇళ్లలో అరకొర వసతుల మధ్య దీపావళి జరుపుకొన్న నిరుపేదలకు నేడు పక్కా ఇళ్లతో ఆత్మగౌరవంతో కూడిన భరోసా లభించిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ గూడు కల్పిస్తామని తెలిపారు. అలాగే కాట్రపల్లిని సంపూర్ణంగా ‘ఆదర్శ గ్రామం’గా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు. అనంతరం అధికారులంతా లబ్ధిదారుల కుటుంబసభ్యులతో కలిసి స్వయంగా దీపాలు వెలిగించి, వారికి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాల్లో పాలుపంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెరుమాండ్ల హైమా బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, గిర్దావర్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ కోనేటి రాజయ్య గారు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు హుజూరాబాద్.





