
—దీపాల వెలుగులవలె ప్రతి ఒక్కరి జీవితాల్లోని చీకట్లు పారద్రోలి వెలుగులు నింపాలి.
—హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లిలో ఘనంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల’ కార్యక్రమం.
—దీపాలు వెలిగించి, టపాకాయలు కాలుస్తూ, మిఠాయిలు పంచిపెట్టిన ఇంచార్జి ప్రణవ్.
—కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెరవేరిన పేదవారి సొంతింటి కల.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (ధర్మరాజుపల్లి ): గతంలో ఇళ్లు లేని నిరుపేదలు పూరి గుడిసెల్లో, అద్దె ఇళ్లలో దీపావళి జరుపుకుంటే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వారి సొంతింటి కలను నెరవేర్చి, సొంత ఇంటిలోనే పండుగను జరుపుకునేలా ఆర్థిక భరోసా కల్పించిందని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.

హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామంలో నిర్వహించిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు” కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి పండుగ చేసుకున్నారు. ప్రణవ్ స్వయంగా దీపాలు వెలిగించి, బాణాసంచా కాలుస్తూ లబ్ధిదారులకు మిఠాయిలు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 2,500 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ధర్మరాజుపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి 110 ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 60కి పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలినవి కూడా త్వరలోనే పూర్తవుతాయని వివరించారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని భరోసా ఇస్తూ, ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చైర్ పర్సన్ సుహాసిని మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారులందరికీ దీపావళి కానుకగా సీఎం రేవంత్ రెడ్డి నూతన గృహాలను అందించి నిజమైన వెలుగులు తెచ్చారన్నారు.


ఈ వేడుకల్లో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్లు, స్థానిక గ్రామ సర్పంచ్, మండల/పట్టణ అధ్యక్షులు కిరణ్, తిరుపతి, మహిళా అధ్యక్షురాళ్లు లావణ్య, స్వప్న, రాధ, కల్పనలతో పాటు కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న వోడితేల ప్రణవ్
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని – మనోజ్ రావు గారు, చైర్పర్సన్ పురపాలక సంఘం హుజురాబాద్.
*దీపావళి శుభాకాంక్షలు*

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి గారు, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు (సింగాపూర్) హుజురాబాద్.
@దీపావళి శుభాకాంక్షలు@

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తాళ్లపల్లి స్వప్న – వెంకటేష్ గారు, గ్రా: సర్పంచ్ జూపాక, మండలం: హుజురాబాద్., బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ పెరుమాండ్ల హైమ బిక్షపతి గారు, గ్రా: కాట్రపల్లి సర్పంచ్, మండలం హుజురాబాద్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.





