
—వెల్మ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జువ్వాడి నర్సింగారావు ను సన్మానించిన ఓసీ జేఏసీ నేతలు…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ :రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్ గా శనివారం హైదరాబాద్ లోని మైత్రి వనం లోని కార్యాలయం లో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన జువ్వాడి నర్సింగారావు ను ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆధ్వర్యంలో నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

అనంతరం హకీంపేట్ లోని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ పద్మనాయక కళ్యాణ మంటపం లో నిర్వహించిన జువ్వాడి నర్సింగరావు ఆత్మీయ సన్మాన కార్యక్రమం లో నిర్వహించిన కార్యక్రమంలో ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు హాజరై మాట్లాడారు.
రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకట్ స్వామి,రాజ్యసభ మాజీ సభ్యులు, వైస్ రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు డాక్టర్ కేవీపీ రాంచందర్ రావు,జగిత్యాల ఎం ఎల్ ఏ డాక్టర్ సంజయ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాంగుండం ఎం ఎల్ ఏ మక్కాన్ సింగ్ టాగూర్,ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ అధ్యక్షులు పాపారావు, ఉపాధ్యక్షులు తాండ్ర శ్రీనివాస్ రావు,ఉమ్మడి వరంగల్ జిల్లా వెల్మ అసోసియేషన్ అధ్యక్షుడు, ఓసీ జేఏసీ రాష్ట్ర కోశాదికారి నడిపెల్లి వెంకటేశ్వర్ రావు, వరంగల్ జిల్లా ఓసీ జేఏసీ అధ్యక్షుడు కోలగూరి రాజేశ్వర్ రావు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెలమ సంఘాల అధ్యక్షుడు నీలగిరి హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి బల్మూరి ప్రసాద్ రావు,సిరిసిల్ల జిల్లా వెల్మ అసోసియేషన్ అధ్యక్షులు కమలాకర్ రావు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు మనోహర్ రావు, జగిత్యాల జిల్లా వెలమ అసోసియేషన్ అధ్యక్షులు ఐలినేని సాగర్ రావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కిషన్ రావు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకట రమణ రావు
ఓసీ జేఏసీ రాష్ట్ర నాయకులు జనగామ కరుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్బంగా ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో వివిధ ఓసీ సామాజిక వర్గాల పేదల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించి ఓసీ ల కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చి 3 ఏళ్ళు గడుస్తున్నా ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.
ప్రస్తుతం వెలమ, వైశ్య, కమ్మ,కార్పొరేషన్ లను నామ మాత్రంగా ప్రకటించి ఎలాంటి నిధులు కేటాయించక కేవలం అధ్యక్షులను మాత్రమే ప్రకటించి పూర్తి స్థాయి పాలక మండల్లు ఏర్పాటు చేయలేదన్నారు.
నామ మాత్రంగా ప్రకటించిన రెడ్డి కార్పొరేషన్ కు ఎలాంటి నిధులు కేటాయించక నేటికీ అధ్యక్షున్ని సైతం ప్రకటించక పాలక వర్గాన్ని కూడా ఏర్పాటు చెయక నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.
తక్షణమే ఇచ్చిన హామీల ప్రకారం అన్ని ఓసీ కార్పొరేషన్ లకు చట్టబద్దత గల పూర్తి స్థాయి పాలక మండల్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని రామారావు డిమాండ్ చేశారు.అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,
ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విదేశీ విద్యానిది పథకాన్ని వర్తింప జేయాలాన్నారు.
సమావేశనికి హాజరైన డాక్టర్ కేవీపీ రాంచందర్ రావు ను ఓసీ జేఏసీ తరపున పోలాడి రామారావు శాలువాలు కప్పి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది వెలమ బంధువులతో పాటు వివిధ సామాజిక వర్గాల ప్రజలు ఓసీ జేఏసీ రాష్ట్ర జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ కోనేటి రాజయ్య గారు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎరుకల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు హుజూరాబాద్.
#దీపావళి శుభాకాంక్షలు#

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి గారు, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు (సింగాపూర్) హుజురాబాద్.
@దీపావళి శుభాకాంక్షలు@

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తాళ్లపల్లి స్వప్న – వెంకటేష్ గారు, గ్రా: సర్పంచ్ జూపాక, మండలం హుజురాబాద్.. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ పెరుమాండ్ల హైమ బిక్షపతి గారు, గ్రా: కాట్రపల్లి సర్పంచ్, మండలం హుజురాబాద్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.





