
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను హుజూరాబాద్ పట్టణంలో ఆదివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద టౌన్, మండల కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ— “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అహర్నిశలు శ్రమిస్తున్న ప్రజానురంజక నాయకుడు. ఆయన పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధితో పాటు సంక్షేమంలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తోంది. యువతకు, పేదలకు, మహిళలకు అండగా నిలుస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రికి ఆయురారోగ్యాలు, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని కొనియాడారు.
సేవా కార్యక్రమాలతో హోరెత్తిన వేడుకలు:
సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని కేవలం వేడుకలకే పరిమితం కాకుండా పలు సామాజిక, సేవా కార్యక్రమాలను చేపట్టారు:
పట్టణంలోని పలువురు పేదలకు, అనాథలకు పండుగ వాతావరణంలో అన్నదానం (భోజన పంపిణీ) నిర్వహించారు.
ఇటీవల జూనియర్ కాలేజీ సమీపంలో అకాల మృతి చెందిన గోపి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున 25 కిలోల బియ్యం బస్తాను సాయంగా అందజేశారు.





ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల తిరుపతి, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కిరణ్, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ , మహిళా విభాగం అధ్యక్షురాలు పుల్ల రాధ, వివిధ విభాగాల నాయకురాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని – మనోజ్ రావు గారు, చైర్పర్సన్ పురపాలక సంఘం హుజురాబాద్.
&దీపావళి శుభాకాంక్షలు&

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి గారు, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు (సింగాపూర్) హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తాళ్లపల్లి స్వప్న – వెంకటేష్ గారు, గ్రా: సర్పంచ్ జూపాక, మండలం హుజురాబాద్.. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ పెరుమాండ్ల హైమ బిక్షపతి గారు, గ్రా: సర్పంచ్ కాట్రపల్లి, మండలం హుజురాబాద్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.





