
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ (టిపిసిసి) ఎస్సీ సెల్ ఇన్చార్జిగా హుజురాబాద్ మున్సిపాలిటీ ఇందిరా నగర్ బీసీ కాలనీకి చెందిన బత్తుల పరశురాములు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

పార్టీకి పరశురాములు అందిస్తున్న నిరంతర సేవలను గుర్తించే ఈ బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు. నియామక ఉత్తర్వులను అందుకున్న అనంతరం పరశురాం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
తన నియామకానికి సహకరించిన Pcc అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిసిసి జిల్లా అధ్యక్షులు మేడిపల్లి సత్యం, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణలకు ఈ సందర్భంగా పరశురాం ధన్యవాదాలు తెలిపారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు, ఎస్సీ విభాగాన్ని మరింత క్రియాశీలకంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పరశురాం తెలిపారు. ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు ఏ అవసరమొచ్చినా తనను నేరుగా సంప్రదించవచ్చని కోరారు. కాగా పార్లమెంటు ఇన్చార్జిగా నియామకమైన బత్తుల పరుశురాములకు మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరియు ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని – మనోజ్ రావు గారు, చైర్పర్సన్ పురపాలక సంఘం హుజురాబాద్.
@దీపావళి శుభాకాంక్షలు@

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి గారు, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు (సింగాపూర్) హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తాళ్లపల్లి స్వప్న – వెంకటేష్ గారు, గ్రా: సర్పంచ్ జూపాక, మండలం హుజురాబాద్.. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హుజురాబాద్.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ పెరుమాండ్ల హైమ బిక్షపతి గారు, గ్రా: కాట్రపల్లి సర్పంచ్, మండలం హుజురాబాద్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.





