
—విజేతలకు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
—క్లబ్ అభివృద్ధికి అందరినీ కలుపుకొని పనిచేయాలని సూచన
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, నవంబర్ 16: హుజూరాబాద్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నూతన పాలకవర్గ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. విజేతలకు శాలువాలు కప్పి సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. క్లబ్ సభ్యులు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నందున, వారి అంచనాలకు అనుగుణంగా నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని సూచించారు. క్లబ్ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అందరినీ కలుపుకొని సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులు తమ విజయానికి సహకరించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నూతన కార్యవర్గ వివరాలు:
- వైస్ చైర్మన్: పుల్లూరి ప్రభాకర్ రావు
- సెక్రటరీ: కటుకూరి మల్లారెడ్డి
- ట్రెజరర్: గరేపల్లి శ్రీనివాస్
- ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు (EC): అనిల్ ఆకెనపల్లి, ధర్మారెడ్డి గడ్డం, నరసింహారెడ్డి కేసిరెడ్డి, రాజిరెడ్డి మ్యాకల, శ్రవణ్ పొనగంటి, మాగంటి శ్రీధర్, గోలి సురేష్ లు సన్మానించిన వారిలో ఉన్నారు.




