
— వరసగా నాలుగు సార్లు కౌన్సిలర్ గా భార్య రికార్డు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ క్లబ్ లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో EC మెంబర్ గా భారీ విజయం సాధించిన కేసిరెడ్డి నర్సింహారెడ్డినీ పాపారావు బొంద చిరు వ్యాపారులు ఘనంగా సత్కరించి ఘన సన్మానం చేశారు. స్ధానిక ఫ్లవర్ మర్చంట్ అసోసియేషన్, ఫ్రూట్స్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విడివిడిగా సన్మానం చేశారు.


ఫ్లవర్ మర్చంట్ వ్యాపారులు గజామాల ఘనంగా సన్మానం చేశారు. అదే విధంగా ఫ్రూట్స్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా చిరు వ్యాపారులు సత్కారం చేసి నర్సింహారెడ్డి వార్డు లో చేసిన అభివృద్ధి పనులు, వ్యక్తి గతంగా ప్రతి ఒక్కరికీ ఏ అవసరం వచ్చిన ముందుంటారని పేర్కొన్నారు. 2006 నుండి సుమారు 20ఏళ్లుగా వార్డు లో అభివృద్ధి కోసం తపిస్తూనే ఇంటింటికి సేవలు అందించడం జరుగుతుందని టీడీపీ సీనియర్ నాయకులు ఇనుగల గోవర్ధన్ పేర్కొన్నారు. హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించడం పట్ల చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శివ కోటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి అక్క వేణు, ఉపాధ్యక్షులు నరసింహ, కార్యదర్శి సమ్మయ్య కోశాధికారి సుదర్శన్, ఫ్రూట్స్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్యాల సమ్మయ్య, కార్యదర్శి మడిపల్లి ప్రభాకర్, ఉపాధ్యక్షులు గుడ్డేల్గుల సారయ్య, చెట్టి అరుణ్ కుమార్, స్వరూప సమ్మక్క, సుజాత, సంధ్య, అయిలమ్మ, అంజి, శ్రీరామ రమణమ్మ, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.




