
—నూతన్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన గంగుల, ఎమ్మెల్యేలు
—కెప్టెన్ జన్మదిన కేక్ కట్ చేసిన
బిఆర్ ఎస్ నేతలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆదివారం జరిగిన హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో సెక్రటరీగా విజయం సాధించిన కటుకూరి మల్లా రెడ్డిని మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ సమయంలో క్లబ్ ను తీర్చి దిద్దిన ఘనత కెప్టెన్ లక్ష్మీకాంత రావుకు దక్కిందని అన్నారు. ఈ క్లబ్ ను కెప్టెన్ ఆకాంక్షకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నూతన కార్యవర్గం ఉందని అన్నారు. నూతన కార్యవర్గానికి వారు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు వారు లక్ష్మీకాంతరావు జన్మ దినోత్సవం పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి కెప్టెన్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు కేక్ తినిపించారు.




