
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజూరాబాద్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని బోర్నపల్లి రోడ్డులో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో బుధవారం గణపతి విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. సుబ్రహ్మణ్య మఠానికి చెందిన డాక్టర్ విద్యా ప్రసన్న తీర్థ స్వామి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి మండప పూజలు, మహాగణపతి హోమం, విశ్వంబర పూజ, సూక్త హోమం, కుంకుమార్చనం వంటివి నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపనకు ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. హాజరైన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని వారు చెప్పారు.




పెద్ద సంఖ్యలో భక్తులు మంగళ హారతులు, కొబ్బరికాయలతో పాల్గొనగా, కమిటీ అధ్యక్షులు దొంత రమేష్, ప్రధాన కార్యదర్శి అంగీరక రాజేంద్రప్రసాద్, అర్చకులు పందిళ్ళ భాస్కర్ శర్మ, ఇతర సభ్యులు పూజా వేడుకల్లో పాల్గొన్నారు. కాగా జలాధివాసం కార్యక్రమంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఓడితెల సతీష్ బాబు- శమిత దంపతులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. మీ డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ…

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ గాలి రాకేష్ నేత గారు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా నాయకుడు, హుజురాబాద్.




