
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ,హుజురాబాద్ :
శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గురువారం మహాగణపతి హోమం , పంచసూక్త పారాయణం ను సుబ్రమణ్య మఠం స్వామీజీ డాక్టర్ విద్యా ప్రసన్న తీర్థ స్వామి మార్గదర్శకంలో ఘనంగా జరిగాయి.

గత రెండు రోజులుగా హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి రోడ్ లో గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా వేద పండితులు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా జరిగే అన్ని కార్యక్రమాలను శాస్త్రోత్తంగా సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుండి మంటప పూజలు, అష్టదిక్పాలక హోమం, విశ్వాంబర పూజ, స్వస్తివాచనం, పంచసూక్త పారాయణం, కుంకుమార్చన, దీపారాధన, పుష్పాదివాసం, వేద పఠనం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. స్వామీజీ విద్యా ప్రసన్న తీర్థ స్వామిని దర్శించుకోనీ భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు.



ఆలయ ప్రాంగణమంతా భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో హుజూరాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రధాన పూజారి పందిళ్ళ భాస్కర్ శర్మ, దేవస్థానం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దొంత రమేష్, అంగిరక ప్రసాద్, కార్యవర్గం, కౌన్సిలర్లు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

ఈ వేడుకలలో మాజీ ఎంపీ వోడితెల లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే ఓడితెల సతీష్ కుమార్, హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, భక్తులు పెద్ద ఎత్తున సందర్శించి ప్రత్యేక పూజలల్లో పాల్గొన్నారు.




