
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త సంఘటన మంత్రి మాన్యశ్రీ సత్యం జీ గారు ప్రఖండాల వారీగా చేపట్టిన పర్యటనలో భాగంగా గురువారం హుజురాబాద్ (ఎదులాపురం) ప్రఖండంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు అయ్యప్ప దేవాలయ ఆవరణలో హిందూ బంధువులు, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, గురుస్వాములతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సత్యంజీ మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణంతో పాటు ప్రతి గ్రామంలో హితచింతక్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు. సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పట్టణ నూతన కమిటీ ఎన్నిక:
అనంతరం హుజురాబాద్ పట్టణ నూతన కమిటీని ప్రకటించారు. ప్రఖండ ధర్మాచార ప్రముఖ్‌గా కొమురవెల్లి రాజు, పట్టణ అధ్యక్షులుగా అక్కినపల్లి శ్రావణ్, పట్టణ కార్యదర్శిగా కనకం శ్రీనును నియమించారు. అలాగే మండల ఉపాధ్యక్షులుగా కొండం రాజేందర్ రెడ్డి, గుడిశాల రమేష్‌లను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రాంత సేవా ప్రముఖ్ కోమల రాజేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఉప్పల శ్యామ్, జిల్లా ఉపాధ్యక్షులు కళ్లెం సుధాకర్ రావు, మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ఇదూలకంటకంటి రవీందర్ రెడ్డి, కందుల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు కంకణాల రమేష్ రెడ్డి, మండల కార్యదర్శి భాషాబోయిన చంద్రయ్య, గోరక్ష ప్రముఖ్ రావుల సురేష్, తూర్పాటి రాజు, పరిపాటి కొండల్ రెడ్డి, దామర అనురాగ్, బండారి లావణ్యతో పాటు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, పలువురు హిందూ బంధువులు పాల్గొన్నారు.

అనంతరం బోర్నపల్లి శివారులో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ దొంత రమేష్, ప్రధాన కార్యదర్శి అంగీరక రాజేంద్రప్రసాద్ మరియు కమిటీ సభ్యులు సన్మానించారు.




