
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని అన్నారు.


శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వార్డు సభలలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ సుహాసిని మాట్లాడుతూ.. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన ఇంటి పెద్దకు 5 లక్షల బీమాను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అర్హులైన ప్రజలంతా మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న వార్డు సభలలో వారి వివరాలను నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి కిషన్, కౌన్సిలర్లు, మేనేజర్ భూపాల్ రెడ్డి, ఎస్. ఐ. కిరణ్, ఆర్ ఐ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
—మండలంలో గ్రామసభలు
హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు కోసం గ్రామాలలో అధికారులు ప్రజల వివరాలను నమోదు చేసుకున్నారని హుజురాబాద్ ఎంపీడీవో తూర్పాటి సునీత తెలిపారు.




