స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల భవిష్యత్ ప్రణాళికపై సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘము కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘము జాతీయ అద్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై రిజర్వేషన్ల పై అవగాహన కల్పిస్తు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 43 శాతం పెంచి ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పుడు హడావిడిగా నిరహిస్తామంటే బీసీలు చూస్తూ ఊరుకోరని, రాష్టంలో ఆందోళనలు నిర్వహించి మా బీసీల సత్తా ఈ ప్రభుత్వానికి చూపిస్తామని శ్రీనివాస్ గౌడ్ తో పాటు సమావేశంలో పాల్గొన్న నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ప్రో.వెంకటేశ్వర్లు ప్రో గాలి వినోద్ కుమార్, కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేశాచారి, గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ బాలగొని బలరాజ్ గౌడ్, సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్, వివిధ బీసీ కుల సంఘాల అద్యక్షులు అంబాల నారాయణగౌడ్, బూర మల్సూర్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, వేముల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని బీసీ రిజర్వేషన్ల పెంపుకు అందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించటానికి మరో సారి సమావేశం కావాలని పిలుపునిచ్చారు.