స్వర్ణ ఉదయం ప్రతినిధి, హైదరాబాద్:
తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలు సంభవించాయి. 20 జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ స్థాయిలో బదిలీలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే కలెక్టర్లకు స్థానచలనం కలగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 20 జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. ఖమ్మంకు బదిలీ అయ్యారు.
- మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్.. నాగర్ కర్నూల్కు బదిలీ అయ్యారు.
- ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ ఝా.. రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా అపాయింట్ అయ్యారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పీ అనురాగ్ జయంతి.. కరీంనగర్కు బదిలీ అయ్యారు.
- నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కామారెడ్డికి బదిలీ అయ్యారు.
- కామారెడ్డి కలెక్టర్ జితేష్ వీ పాటిల్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ అయ్యారు.
- వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ.. జయశంకర్ భూపాలిపల్లికి బదిలీ అయ్యారు.
- హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్.. నారాయణపేట్ జిల్లాకు బదిలీ అయ్యారు.
- పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా కోయ శ్రీహర్ష నియమితులు అయ్యారు.
- వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావిణ్య.. హన్మకొండకు బదిలీ అయ్యారు.
- ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ బుడుమజ్జి సత్యప్రసాద్.. జగిత్యాలకు బదిలీ అయ్యారు.
- రవాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి బీ విజేంద్ర.. మహబూబ్ నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు.
- నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల కలెక్టర్గా అపాయింట్ అయ్యారు.
- భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రతీక్ జైన్.. వికారాబాద్ జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు.
- నల్లగొండ జిల్లా కలెక్టర్గా నారాయణరెడ్డి బదిలీ అయ్యారు.
- ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్ష్ సురభి.. వనపర్తి జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు.
- సూర్యాపేట్ జిల్లా కలెక్టర్గా తేజాస్ నందాల్ పవార్ బదిలీ అయ్యారు.
- వ్యవసాయ శాఖ జాయింట్ కార్యదర్వి ఎం సత్య శారదా దేవి వరంగల్ జిల్లా కలెక్టర్గా అపాయింట్ అయ్యారు.
- జగిత్యాల అదనపు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ములుగు జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు.
- జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్.. నిర్మల్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు.