
-34 ఏళ్లకు కలుసుకున్న బాల్య మిత్రులు
-బాల్యంలో విడిపోయి ప్రయోజకులై కలుసుకున్నారు
-1888-90 విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
-నాటి గురువులకు సత్కారాలు
స్వర్ణోదయం ప్రతినిధి, సైదాపూర్: బడిగంట కొట్టింది మొదలు చిట్టి కొట్టే దాకా…పలక పట్టి, బట్టి పట్టి, పదవతరగతి పూర్తయ్యేదాకా చెడ్డి, మిడ్డి దోస్థులుగా పెరిగారు, బాల్యం నుండి యవ్వన దశ దాకా ఆ సర్కారు బడి లోనే వారి బంగారు బాల్యం నడిచింది. ఎక్కడో పుట్టి ఇక్కడే పెరిగిన బాల్య మిత్రులు 34 సంవత్సరాల క్రితం వీడ్కోలు సమావేశంలో విడిపోయారు. ఇప్పుడు ప్రయోజకులై సమాజంలో తమ సామర్థ్యాన్ని చూస్తూ పేరు ప్రక్యాతలు గడిస్తున్నారు. ఎట్టకేలకు తమ బాల్యమిత్రులు అంతా కలుసుకోవాలని ఆలోచనకు వచ్చి ఒకచోట చేరారు. ఎక్కడ బాల్యం గడిచిందో ఎక్కడ విడిపోయారో అక్కడే కలుసుకుందాం అనుకున్నారు. మండల కేంద్రంలోని వేన్కేపల్లి ఉన్నత పాఠశాలలో 1988-90 లో తాము చదివి వీడ్కోలు తీసుకున్న పాఠశాల ఆవరణలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని బాల్యాన్ని గుర్తు చేసుకుని ఒక్కరోజు తమ స్నేహ బంధాన్ని తలుచుకున్నారు. నాటి గురువులను తలుచుకొని సప్రేమతో చిరు సత్కారం చేశారు. వారు నేర్పిన విద్యాబుద్ధులను గుర్తు చేసుకున్నారు. తామున్న ఉన్నత స్థితిని గురువులకు చెప్పి పాదాభివందనం చేసుకున్నారు. నాటి రిజిస్టర్ లో ఉన్న 69 మంది క్లాస్మేట్స్ కి 58 మంది ఈ ఆత్మీయ సమ్మేళనంలో మమేకమయ్యారు. నాటి గురువులు కొత్త మల్లారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, కొల్ల చిన్న రాజిరెడ్డి, కూతురు నారాయణ రెడ్డి, దామోదర్ రావు, చంద్రయ్య, అప్పటి అటెండర్ లక్ష్మి లతో పాటు 1989,90 బ్యాచ్ క్లాస్ మెట్స్ కలుసుకున్నారు.

