
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రేపు హుజురాబాద్ పట్టణంలో జరగబోయే బక్రీద్ పండుగ కొరకు జరిగే పలు ఏర్పాటు పనులను హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక ఆదివారం సాయంత్రం పరిశీలించారు. స్థానిక ఈద్గాలో ముస్లిం సోదరులు నమాజు చేసుకునేందుకు వీలుగా షామియానాలు ఇంట్లో కార్పెట్లు మైక్ సెట్ లు తాగునీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆమె ఆదేశించారు. ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే ఎలాంటి లోటుపాట్లు లేకుండా బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అందరూ సహకరించాలని ఆమె సూచించారు. చైర్ పర్సన్ వెంట బక్రీద్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

