మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు మంగళవారం హుజరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు నేరెళ్ల మహేందర్ గౌడ్, పత్తి కృష్ణారెడ్డి, తిప్పారపు సంపత్, సామల రాజిరెడ్డి, దేశిని కోటి, తుమ్మెటి సమిరెడ్డి, మమ్మద్ బాబాలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఆధారాలు లేని నిందలు వేస్తూ, పరుష పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ మంత్రి స్కామ్ ను లైవ్ లో ఆధారాలతో పట్టుకోవడంతో జీర్ణించుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ మంత్రి నిష్పక్షపాతంగా పనిచేస్తే రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫ్లైస్ క్యామ్ లో ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కొలిపాక నిర్మల – శ్రీనివాస్,యాదగిరి నాయక్, వనిత – కుమార్,కుమారస్వామి, తిరుమల్ రెడ్డి, ముత్యం రాజు, జీవిత నరేష్, స్వప్న భాస్కర్, కిషన్, రమేష్, రమాదేవి, మంజుల కృష్ణ, ఉజ్మా ఇమ్రాన్, సృజన పూర్ణచందర్, రాజకొమురమ్మ, తాళ్ళపెల్లి శ్రీనివాస్, లావణ్య నరసింహరెడ్డి, ఉమాదేవి రమేష్, ఉమా మహేశ్వర్ లు పాల్గొన్నారు.