
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆఫీస్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సైదాపూర్, చెల్పూర్, చల్లూరు, వీణవంక, వావిలాల, ఇల్లంతకుంట అన్ని అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలోని ఒక సంవత్సరము నుండి 19 సంవత్సరాల బాల బాలికలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్టు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు బుధవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. రేపు తేదీ 20వ తేదీ గురువారం రోజు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆదేశాల మేరకు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. కడుపులో నులి పురుగులు పెరగటం వలన అభ్యాసన శక్తి తగ్గుతుందని.. పిల్లలు సరిగా చదవలేరని అందుకే విధిగా తల్లిదండ్రులందరూ పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని ఆయన కోరారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు సహకరించాలని ఆయన కోరారు. ఆల్బెండజోల్ మాత్రలను పిల్లలందరూ భోజనం చేసిన తర్వాతనే మింగించాలని అని చెప్పారు. ఈ మాత్రాల వలన ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవని, సమస్యలు ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని సంప్రదించాలని ఆయన కోరారు. దాదాపు 53000 మంది బాల బాలికలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాజిత్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పాల్గొన్నారు.
