
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: హజ్ యాత్రకు 83% శాతం మంది అక్రమంగా వచ్చినవారే కావడంతో మృతులను గుర్తించడం కష్టంగా మారిందని సౌదీ అధికారిక వర్గాలు తెలిపాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలుల కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రలో 1,300 మందికి పైగా మరణించినట్లు సౌదీ అధికారిక వర్గాలు
ప్రకటించాయి. చనిపోయిన వారిలో 83 శాతం మంది చట్ట విరుద్ధంగా వచ్చినవారేనని తెలిపాయి. ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం సంక్లిష్టంగా మారినట్లు వెల్లడించాయి. కొంతమందికి ఇప్పటికే మక్కాలో సంప్రదాయం
ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
