
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. మంత్రిమండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు లేదంటే జులై మొదటి వారంలో విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీఎం ఢిల్లీ టూర్ తో రాష్ట్ర నేతల్లో పదవుల ఆశ కలుగుతుంది.
