హుజరాబాద్ లో ప్రవేట్ పాఠశాల యాజమాన్యాలు ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారనీ, ఫీజులు వసూలు చేస్తున్నారని.. సంబంధించిన విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోవడం లేదని తెలంగాణ విద్యార్థి యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కర్ర శ్రీధర్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విద్య హక్కు చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కేసి ఇష్టానుసారంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు NCRT నియమ బంధనాలనలకు వ్యతిరేకంగా పాఠశాలలు నడిపిస్తున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్న కూడ సంబంధిత విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వేతనాలు తీసుకుంటూ ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలకు సంబంధించి విద్యాశాఖ అధికారులకు ఏదాయినా ఒప్పందం జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. నర్సరీ చదివే విద్యార్థుల నోట్ బుక్స్ కు రూ. 3000 నుండి రూ. 5000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని పాఠశాలలకు అనుమతులు లేకున్నా కూడా నడుస్తున్నాయని, అయినా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఇప్పటికైనా అనుమతి లేని పాఠశాలల పేర్లు పత్రికా ముఖంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలపై, అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమాన్యంపై ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా చేపడతామని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.