
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బ్రాండ్ షాపులో బీరు తాగుతున్నారా జరా చూసి తాగండి ఎందుకంటే ఆ బీర్ లో పురుగులు రావచ్చు జాగ్రత్త!? ఎందుకంటే శనివారం ఓ మద్యం ప్రియుడికి బీరులో పురుగు రాగా సగం తాగాక గమనించి ఒక్కసారిగా వాంతి చేసుకున్నాడు. వెంటనే ఆ బీరును పట్టుకెళ్ళి బ్రాండ్ షాపు కౌంటర్ పై చూపించగా సదరు షాపు నిర్వాహకుడు దాని బదులు వేరే మీరు ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ముందు భవిష్యత్తులో మద్యం ప్రియులకు మళ్లీ వీరులో పురుగులు రావాలి గ్యారెంటీ అయిందని పలువురు మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. బాధితుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మికుంట మండలం కోరపల్లి -వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి సంపత్ పని మీద హుజురాబాద్ కు వచ్చి తిరిగి స్వగ్రామం జమ్మికుంట వైపు వెళ్తుండగా పట్టణ శివారులోని అదే రోడ్లో గల ఆర్ఆర్ అనే వైన్స్ లో KF లైట్ బీర్ తీసుకొని తాగుతుండగా అందులో ఒక పురుగు వచ్చింది. దానిని గమనించిన సదరు వ్యక్తి వెంటనే వెళ్లి కౌంటర్ మీద వ్యక్తికి చూపించిగా వెంటనే అతను ఆ బీర్ తీసుకొని ఇంకో బీర్ ఇవ్వడం జరిగింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న విష పురుగులు బీర్ లలో వస్తున్నా దీనికి సంబందించిన అధికారులు పట్టించుకోక పోవడం చాలా బాధాకరమని, వెంటనే సంబంధిత ఎక్సైజ్ అధికారులు స్పందించి RRR వైన్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత పుల్లూరి సంపత్ కోరారు. అలాగే సదరు బ్రాండ్ షాపులో ఉన్న మొత్తం బీర్ స్టాక్ ను క్షుణ్ణంగా పరిశీలంచాలని బాధితులు కోరుతున్నారు.


