
స్వర్ణోదయం ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమేదారు బంజర గ్రామంలో పిడుగు పడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బంజర గ్రామానికి చెందిన బొర్రా చందు (11),బొర్రా సిద్దు (15) గురువారం కురిసిన బారీ వర్షాల లో పిడుగు పాటుకు లోనయ్యారు. బంజర సమీపంలో ఉన్న పుల్లయ్య చెరువు వద్ద ఈ దుర్ఘటన జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇద్దరూ సోదరులు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
