మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుస్నాబాద్: బీసీల కుల జనగణ జరిగాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సామాజిక కార్యకర్త పలస సుభాష్ చంద్రబోస్ నేత కోరారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, సామాజిక ప్రజా సేవకులు వలస సుభాష్ చంద్ర బోస్ నేత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ పక్క అమలు చేయాలని, దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ దేశంలో ఉన్న జంతువులకు లెక్కలు ఉంటాయి కానీ బీసీల కులగణన ఎందుకు జరగడంలేదని ఆయన ప్రభుత్వం ప్రశ్నించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి అయినప్పటికీ బీసీల కులగణన జరగకపోవడం ఎంత బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీవో ఇచ్చి ఐదు మాసాలు అయినప్పటికీ ఇంతవరకు మొదలు పెట్టకపోవడంపై ఆయన ధ్వజమెత్తారు. మేమెంతో మా వాటా అంతా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచేలా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ చిత్తశుద్ధితో అమలు చేయవలసిందిగా కోరారు. లేదంటే బీసీలమంతా ఏకమై గ్రామ గ్రామాన ఉద్యమం చేపడతామని ఆయనే పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం ఉన్న వెనుకబడి వర్గాలు రాజ్యాధికార స్థానంలో వారి స్థానం ఎక్కడ ఉందనీ ఆయన ప్రశ్నించారు. ఉద్యమాల ద్వారానే హక్కుల సాధించుకోవడం జరుగుతుందని పోరాటానికి బీసీలందరం ఐక్యతతో ముందుకు వెళ్దామని వలస సుభాష్ నేత పేర్కొన్నారు.
- Home
- మేమెంతో..మా వాటా అంతా… బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు కల్పించాలి..జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ నేత